21 August, 2026 | 12:48 AM

కాలనీవాసుల సమ్మతి మేరకే బాక్స్ డ్రైన్ నిర్మాణం

21-08-2026 12:12 AM

తోట లక్ష్మీకాంతరెడ్డి

అల్వాల్, ఆగస్టు  20, (విజయ క్రాంతి): వెంకటాపురం డివిజన్ పరిధిలోని దినకర్ నగర్ రోడ్ నెంబర్- 17 లో బాక్స్ డ్రైన్ ప నులు కాలనీ వాసుల వినతి,ఆకాంక్షలకు అ నుగుణంగా చేపట్టడం  జరుగుతుంది అని  మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నా యకుడు తోట లక్ష్మీకాంతరెడ్డి అన్నారు. ఈ పనులపై కాలనీవాసులు అభ్యంతరం తెలిపడంతో గురువారం  కాలనీ వాసులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మై నంపల్లి హనుమంత రావు ఆదేశాల మేరకు బాక్స్ డ్రైన్ పనులు చేపడుతు న్నారు.

మీ అందరి అభిప్రాయం ప్రకారమే ఇక్కడ బాక్స్ డ్రైనేజీ పనులు చేపట్టాలని ఆయన డిఈ మహేష్ ను ఆదేశించినట్లు  తెలిపారు.ఈ కా ర్యక్రమంలో కాలనీవాసులు లావణ్య కృష్ణ, సూర్యకిరణ్, ఫణి కుమార్, సెల్వం భీమ్రావు, కథలప్ప వెంకటేశ్వర చారి, సాత్విక్, లక్ష్మీనారాయణ కాంగ్రెస్ నాయకులు కృష్ణ గౌడ్, బలవంత రెడ్డి, నాగే శ్వరరావు, లడ్డు, సూర్య కిరణ్, లావణ్య, వీనస్ మేరీ, పద్మ, నిర్మల, విజయ తదితరులు పాల్గొన్నారు