21 August, 2026 | 1:46 AM

50 రోజుల్లో వెయ్యి కోట్లు వసూలు

21-08-2026 12:46 AM
  1. మిషన్ 100 డేస్‌తో సివిల్ సప్లయ్ శాఖ కార్యాచరణ 
  2. మిల్లులపై విజిలెన్స్ దాడులు  
  3. 11.17 ఎల్‌ఎంటీలకు 8.34 ఎల్‌ఎంటీల ధాన్యం రికవరీ 
  4. కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): తెలంగాణ పౌర సరఫరాల శాఖ  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ 100 డేస్’లో భాగంగా చేపట్టిన కార్యక్రమం 50 రోజులు పూర్తి చేసుకుంది. రాబోయే ఖరీఫ్ (2026- సీజన్ కంటే ముందే.. పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ తరలింపు, గోదాములు ఖాళీ చేయడం, నిధుల సమీకరణలో ఈ శాఖ కీల క విజయాలు సాధించింది. సివిల్ సప్లయ్ శాఖ చేపట్టిన కఠిన నిర్ణయాలతో వేలం వేసిన ధాన్యా నికి సంబంధించి ఇప్పటీ వరకు రూ. 1,000.57 కో ట్లు వసూలు చేశారు.  సీ ఎంఆర్‌కు సంబంధించి సి విల్ సప్లయ్‌శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గురు వారం సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కార్యాచరణ ప్రారంభించిన 50 రోజుల్లోనే 11.17 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ డెలివరీని సాధించినట్లు, మొదటి వారం నుంచి ఆరో వారం వరకు నిర్దేశించిన లక్ష్యాలకు గాను 8.34 ఎల్‌ఎంటీ డెలివరీ చేశారు. లక్ష్యాలలో 74 శాతం పురోగతిని సాధించినట్లు వివరించారు.  340 మిల్లులు తిరిగి ప్రారంభమవడంతో డెలివరీ చే యని  మిల్లుల సంఖ్య 1,351 నుంచి 1,011కి తగ్గింది. ధాన్యం కొనుగోళ్లకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా, నిధులను సమీకరణలో 75 శాతం లక్ష్యాన్ని సాధించామన్నారు. రాబోయే సీజన్‌కు గోదాముల్లో ఖాళీ  మిగిలిపోయిన ధాన్యాన్ని వేలం వేస్తున్నట్లు తెలిపారు.

బకాయిల చెల్లింపునకు చివరి ఛాన్స్

పాత బకాయిలు రాబట్టేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9 ద్వారా 2022 సం బంధించి మిల్లర్లు చెల్లించేందుకు చివరి అవకాశం ఇచ్చామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అక్టో బర్ 31 నాటికి మూడు వాయిదాలలో ఈ బకాయిలు చెల్లించాల్సి ఉంటుందవని, గడువు దాటి తే వారిని ‘డిఫాల్టర్’గా ప్రకటించి, 25 శాతం జరిమానాతో పాటు 12 శాతం వడ్డీ కూడా వసూలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మిల్లులపై విజిలెన్స్ బృందా లు  క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తూ, బకాయిలు చెల్లించని వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నాయి.

రెవెన్యూ రికవరి (ఆర్‌ఆర్ ) చట్టాన్ని అమలు చేస్తున్నారు. దీంతో డిఫాల్టర్ల ఆస్తుల జప్తు, బ్యాంక్ ఖాతాల సీజ్, ధాన్యాన్ని అక్రమంగా ఉంచుకున్న వారిపై  పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నారు. వీరికి భవిష్యత్తులో ప్రభుత్వ ధాన్యం కేటాయింపులు ఉండ వని స్పష్టం స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.