21 August, 2026 | 1:17 AM

హైసెక్యూరిటీ ఇంటర్ పాస్ మెమోలు

21-08-2026 12:43 AM

నాన్ టియరబుల్ పేపరుతో ముద్రణ

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): ఇంటర్ పాస్ మార్కుల మెమో లను నాన్ టియరబుల్ (చిరగని) పేపర్‌తో, హై సెక్యూరిటీతో ముద్రించినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈసారి అత్యం త భద్రతతో ముద్రించిన ట్లు తెలిపింది. 25 సెక్యూరిటీ ఫీచర్లతో ముద్రించి నకిలీలకు చెక్‌పెట్టేలా ఈ చర్యలు తీసుకున్న ట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. ముద్రించిన పాస్ సర్టిఫికెట్లను ఇంటర్మీడియట్ విద్యాధికారులకు, నోడల్ అధికారులకు  పంపించామని, వారు సంబంధిత ప్రిన్సిపాళ్లకు అందజేస్తారని తెలిపింది. విద్యా ర్థులు కళాశాలల్లో సంప్రదించి మెమోలను తీసుకోవాలని సూచించింది.