28-10-2025 07:07:00 PM
మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణ కేంద్రంలోని మెప్మా కార్యాలయంలో సోమవారం మహిళలకు క్యాన్సర్ పై అవగాహన నిర్వహించి క్యాన్సరు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మీవాని, చందుపట్ల రజిత పాలు పొంది క్యాన్సర్ పై పలు సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఓ లావణ్య, టిఎల్ఎఫ్ అధ్యక్షురాలు ఐతు సితార, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులు , ఆర్పీలు మహిళ సంఘ సభ్యులు పాల్గొన్నారు.