calender_icon.png 28 October, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయండి

28-10-2025 07:08:41 PM

జిల్లా కార్య వర్గ సభ్యులు రేసు ఎల్లయ్య

మండలంలో గడపగడపకు ప్రచారం

ఎర్రజెండా వందేళ్లు బారీగా జనం సమీకరణ

ఆళ్ళపల్లి (విజయక్రాంతి): ఖమ్మంలో జరుగుతున్న సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలను జయప్రధం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రేసు ఎల్లయ్య అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో గడప గడపకు ప్రచారం చేస్తూ భారీగా జనసమీకరణ చేపట్టారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించి వంద సంవత్సరాలు పూర్తైందన్నారు.

నాటి నుండి నేటి వరకు పేదల పక్షాన అలుఎరగని పోరాటాలు చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక పార్టీ సీపిఐ అన్నారు. ఎన్నోపార్టీలు పుట్టి కాలగర్భంలో కలిసి పోయాయని ఒక్క సిపిఐ పార్టీ మాత్రమే జనాదరణతో నిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాడుతూ వందేళ్ళ పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో జరుగుతున్న శతాబ్ది ముగింపు ఉత్సవాలో ప్రతి ఒక్కరూ పాల్గోని జయప్రధం చేయాలని పలుపునిచ్చారు. ఈ ప్రచారంలో పాల్గొన్న నాయకులు కొమరం హన్మంతారావు మండల కార్యదర్శి, sk రహీం, వజ్జ పగడయ్య సహాయ కార్యదర్శులు, మండల నాయకులు రేసు సురేందర్, కసనబోయిన నరేష్, వగలబోయిన రమేష్, తాళ్లపల్లి సాయన్న, తాళ్లపల్లి రమేష్, సుతారి కాంతారావు, తాళ్లపల్లి శ్రీను, వినయ్, ప్రభాకర్, రామయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.