28-10-2025 07:10:43 PM
అచ్చంపేట: శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసం సందర్భంగా అచ్చంపేటలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో భక్తులకు కావాల్సిన వసతులను సమకూరుస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగా దీపారాధన, ఇతర వసతులను కల్పిస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షులు వనం పర్వతాలు తెలిపారు. మహిళలు దీపాలు వెలిగించడానికి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలాగే కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం ఆకాశదీపం వెలిగిస్తామని తెలిపారు. పర్వదినంలో భాగంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు కోట కిషోర్, ఆలయ అర్చకులు చిదంబర శర్మ ఆకాశదీపం వెలిగించారు.