25-09-2025 12:00:00 AM
కలెక్టర్ కుమార్ దీపక్
హాజీపూర్, సెప్టెంబర్ 24 (విజయక్రాం తి): ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పను లు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం హాజీపూర్ మండలం గుడిపేటలో రూ. 216 కోట్ల నిధులతో నిర్మాణమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య కళాశాల నిర్మాణ పనులు పూర్తయితే జిల్లా ప్రజలకు మరింత వేగవంతమైన వైద్య సేవలను అందుతాయన్నారు.
అనంతరం హాజీపూర్ లోని తహసిల్దార్ కార్యాల యాన్ని సందర్శించారు. భూ భారతి రెవె న్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించాలని తహసిల్దార్ శ్రీనివాస్‌రావు దేశ్ పాండే ను ఆదేశించారు.
జాతీయ రహదారి 63 నిర్మాణంలో భాగంగా భూసేకరణ కార్యక్రమానికి సంబంధించి అవార్డుల జారీ ప్రక్రి య త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ డీఈ సజ్జత్ భాషా, ఈఈ లక్ష్మీనారాయణ, ఏఈఈ అనూష, ఇతర అధికారులు పాల్గొన్నారు.