calender_icon.png 25 September, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటల సాగు వివరాల నమోదు తప్పనిసరి

25-09-2025 12:00:00 AM

జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి

జగదేవపూర్, సెప్టెంబర్ 24: రైతులు సా గుచేసిన పంటల వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి అన్నారు. జగ దేవ పూర్ మండలంలోని తీగుల్ గ్రామం లో పత్తి, వరి పంటలను బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ జిల్లాలో పంటల సాగు వి వరాలు నమోదు ప్రక్రియ వేగవంతంగా జ రుగుతుందని, వ్యవసాయ విస్తీర్ణ అధికారు లు క్రాప్ సర్వేలో నిమగ్నమయ్యారని చె ప్పారు.

సర్వే ముగియగానే ఏఈఓలు సం బంధిత జాబితాను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తారని, అభ్యంతరాలుంటే రైతులు తె లియజేయాలని సూచించారు. క్రాప్ బు కింగ్ చేయని రైతులకు పంట కొనుగోలు ప్ర యోజనాలు వర్తించవని అన్నారు. మొక్కజొన్న, పప్పు ధాన్యాలు లాంటి కోతలు పూ ర్తయిన పంటలు కూడా రైతులు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మం డల వ్యవసాయ అధికారి వసంతరావు, ఏఈఓ సాయి ప్రసన్న, పాల్గొన్నారు.