25-10-2025 07:20:56 PM
కలెక్టర్ కుమార్ దీపక్..
మంచిర్యాల (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. శనివారం కాలేజ్ రోడ్డులో నిర్మితమవుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తూ అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో 129.25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. జిల్లా ప్రజలకు మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు, గుత్తేదారుల సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.