calender_icon.png 26 October, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్.ఐ.ఆర్. జాబితా పకడ్బందీగా తయారు చేయాలి

25-10-2025 07:17:58 PM

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి..

స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ పై సీఈఓ నిర్వహించిన వీడియో సమావేశంలో కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్..

ములుగు (విజయక్రాంతి): ఎస్.ఐ.ఆర్. ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఈ వీసిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్.ఐ.ఆర్. నిర్వహణ కోసం చేపట్టిన ప్రిపరేటరీ కార్యాచరణలో పురోగతి ఉండాలని, 2002లో చేసిన ఎస్.ఐ.ఆర్. తో 2025 స్పెషల్ సమ్మరీ రివిజన్ ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియను బూత్ స్థాయి అధికారుల సహకారం తీసుకొని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

ఎస్.ఐ.ఆర్. నిర్వహణ కంటే ముందు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్.ఐ.ఆర్. డేటాను 2025 ఎస్.ఐ.ఆర్. డేటాతో కంపేర్ చేసుకోవాలని ఈ రెండు జాబితాలో కామన్ గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారి వివరాలను క్షేత్ర స్థాయిలో మరోసారి ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ ఎస్.ఐ.ఆర్. మ్యాపింగ్ లో భాగంగా క్యాటగిరి 'ఏ' ని బి.ఎల్.ఓ. యాప్ ద్వారా ధృవీకరిస్తామని, క్యాటగిరి సి, డి లింక్ ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. ఈ.ఆర్.ఓ. కార్యాలయంలో ఇద్దరు బూత్ స్థాయి అధికారులను ప్రత్యేకంగా కేటాయించి శనివారం నాటికి మ్యాపింగ్ పూర్తి చేస్తామని అన్నారు.