07-07-2025 12:03:16 AM
నిజాంసాగర్ జూలై 06( విజయ క్రాంతి) నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, గోర్గల్ గ్రామాల్లోని పార్టీ కార్యకర్తల కుటుంబాలను జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ షిండే పరామర్శించారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన డీలర్ సాయిలు తల్లి మరణించగా, గోర్గల్ గ్రామానికి చెందిన అజ్జం రాజేందర్ అనారోగ్య కారణాలతో మృతి చెందారు.
ఇరువురు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ఓదార్చారు వారి కుటుంబాలకు ఎల్లప్పుడు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట బీ ఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల దుర్గారెడ్డి, గరబోయిన వెంకటేశం, పట్లోళ్ల కిషోర్ కుమార్,కమ్మరి కత్త అంజయ్య, శ్రీకాంత్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, అజ్జం సుభాష్ తదితరులు పవున్నారు.