calender_icon.png 7 July, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు

07-07-2025 12:02:44 AM

- భార్యను బండరాళ్లతో మోది అత్యంత కిరాతకంగా హత్య చేసిన భర్త

- దర్యాప్తు చేపడుతున్న పోలీసులు

ఆదిలాబాద్, జూలై 6 (విజయక్రాంతి): కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు.. భార్యపై అనుమానమా లేదా క్షుద్ర పూజల తెలియదు కానీ... భార్యను బండరాళ్లతో మోది అత్యంత కిరాతకంగా భర్త హత్య చేసి న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం... ఆదిలాబాద్ పట్టణంలోని సుందర య్యనగర్ కాలనీకి చెందిన ఇంగోలే శంకర్ అతని భార్య ఇంగోలే వందన (40)కు ఆరో గ్యం బాగా లేదని మహారాష్ట్ర వైపు ఆయుర్వేద వైద్యం చేపిస్తా అని  నమ్మించాడు.

దిం తో ఈనెల 2వ తేదీన భర్త శంకర్ తన భార్య వందనను తీసుకొని ఇంటి నుండి వెళ్ళాడు. తిరిగి తల్లిదండ్రులు ఇంటికి రాకపోవడంతో కూతు రు ప్రియాంక బంధువుల ఇండ్లలో వాకబు చేశారు. ఐతే ఎలాంటి ఆచూకీ లభ్యం కాకపోకదంతో కూతురు శనివారం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు భర్త ఇంగోలే శంకర్‌పై అనుమానంతో పరారీలో ఉన్న ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారించారు.

దీంతో ఈ హత్య ఉదాంతం వెలుగులోకి వచ్చింది. కాగా ఆదివారం డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ కరుణాకర్ రావు, ఫణిదర్‌లు నిందితునితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. తానే తన భార్యను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి బండరాళ్లతో మోది హత్య చేసినట్లు నిందితుడు శంకర్ ఒప్పుకున్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు.

భార్యపై ఉన్న అనుమానంతోనే హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. ఈ ఘటనపై భార్యపై ఉన్న అనుమానమా లేదా క్షుద్ర పూజల కో సం హత్య చేశాడా.. అనే  కోణాల్లో పూర్తి స్థాయి లో విచారణ చేపడుతున్నామన్నారు.