calender_icon.png 9 July, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి నారు మడులను పరిశీలించిన ఎడిఎ

09-07-2025 07:45:57 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని సారంగపల్లి గ్రామ శివారులోని వరి నారుమల్లను చెన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు భానోత్ ప్రసాద్(Assistant Director of Agriculture Bhanot Prasad) పరిశీలించారు. బుధవారం సారంగపల్లి గ్రామంలోని పలువురు రైతుల పొలాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. వరి మొలక బాగా విచ్చుకున్న తదుపరి ఎత్తుగా తయారు చేసిన బెడ్ల వంటి నారుమలపై పలుచగా చల్లు కొని నారు పెంచుకోవాలని, రెండు నుంచి మూడు ఆకుల దశలో ఎకర నారుమడికి ఒకటి నుంచి రెండు కిలోల డిఏపి, అరకిలో పొటాష్ అందించాలని సూచించారు. వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు నీరు నిల్వ ఉండి నారు నీటిలో మునిగి కుళ్లి పోకుండా కాలువల ద్వారా నీటిని తీసి వేయాలని, ముఖ్యంగా నారు మల్లలో ఐరన్, జింకు సూక్ష్మ పోషకాల లోపం ఎక్కువగా ఉంటుందని, నివారణకు బాగా చివికిన పశువుల పేడను నారుమడి తయారు చేసుకున్నప్పుడే బురద లో వేసుకోవాలని అన్నారు.

లోప లక్షణాలు కనిపిస్తే సూక్ష్మ పోషకాల మిశ్రమం ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి వరి నారు పైపాటుగా పిచికారి చేసుకోవాలని, నారు తీసి పొలములో నాటడానికి వారం రోజుల ముందుగా ఒక యు ఎకరా నారు మడికి 750 గ్రాముల కార్బోఫురాన్ గుళికలు పలుచగా నీరు ఉంచి చల్లుకోవాలని తద్వారా ప్రధాన పొలంలో కాండం తోలుచు పురుగు ఉధృతిని తగ్గించు 5కోవచ్చునని, పురుగు toమందుల పిచికారి రూపంలో రైతుకి పెట్టుబడి కూడా తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఏవో కిరణ్మయి, ఏఈఓ ముత్యం తిరుపతి రైతులు కమల మనోహర్రావు, పుల్లారెడ్డి, రాజయ్య, ఆసంపల్లి రాజయ్య, మల్లారెడ్డి లు పాల్గొన్నారు.