09-07-2025 07:53:56 PM
హైదరాబాద్: ప్రజాభవన్ లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Irrigation Minister Uttam Kumar Reddy) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్రమంగా కృష్ణా జలాలు(Krishna Water) తరలించుకునేలా 2014-2023 నిర్మాణాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్(PowerPoint presentation) జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని, కేంద్రం ముందు నివేదికల ద్వారా వాస్తవ పరిస్థితులను ఉంచామని పేర్కొన్నారు.
వాస్తవాలతో కూడిన నివేదికను ఉత్తమ్ వివరించారని, 9 ఏళ్లు నీటిపారుదలశాఖ కు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు ప్రాతినిధ్యం వహించారని ఆయన వెల్లించారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో తెలంగాణ నష్టపోయిందని ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏం నష్టపోయామో, కృష్ణా జాలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్ ను సూచించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. పతిపక్ష నేత కేసీఆర్ కు అసెంబ్లీకి రావాలని సూచించా.. కానీ సవాల్ చేయలేదు అని అన్నారు.
బేసిన్లు లేవు.. భేషజాలు లేవని, గోదావరిలో 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కాలుస్తున్నాయని, గోదావరి, కృష్ణా, పెన్నా బేసిన్ వరకు నీళ్లు తరలించుకోవచ్చని కేసీఆర్ గతంలో చెప్పారన్నారు. రాయలసీమను రత్నాల సీమగా చేస్తామని కేసీఆర్ చెప్పారని, జగన్ కు సూచనలతో పాటు టెండర్లు, జీవోలు ఇచ్చేలా సహకరించారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్, జగన్ అనుబంధం ఎలాంటిదైనా తెలంగాణకు తీరని నష్టం చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాసే అధికారం కేసీఆర్ కు ఎవరూ ఇచ్చారు..? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం వాదించి ఉంటే హైదరాబాద్ కు తాగునీరు సాధించే వాళ్లం అని, ఉమ్మడి కోటా నుంచి హైదరాబాద్ కు తాగునీరు జలాలను వేరు చేయాల్సి ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.