calender_icon.png 10 July, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఖిలభారత గౌడ సంఘం చండూరు మండల అధ్యక్షులుగా వడ్డగోని చంద్రశేఖర్ గౌడ్

09-07-2025 07:48:38 PM

చండూరు (విజయక్రాంతి): అఖిల భారత గౌడ సంఘం చండూరు మండల(Chandur Mandal) నూతన అధ్యక్షులుగా వడ్డగోని చంద్రశేఖర్ గౌడ్, అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కూరెళ్ళ వేములయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే కాలంలో కల్లుగీత కార్మికుల సమస్యల పట్ల నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు. గీత కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటానని, యువతను విద్యావంతులుగా తీర్చిదిద్దే విధంగా ప్రోత్సహిస్తానని వారికి వెన్నంటూ ఉంటూ సహాయ సహకారాలు అందిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌట బాలరాజు గౌడ్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఆయిలి మల్లికార్జున గౌడ్, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.