calender_icon.png 10 July, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి

09-07-2025 07:57:09 PM

- రాబోవు రోజుల్లో కార్మికులు ఐక్యంతో పోరాడాలి

- రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురజా రామచంద్రం

మునుగోడు (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురజా రామచంద్రం అన్నారు. దేశవ్యాప్త కార్మిక కర్షక రైతు సమ్మెలో భాగంగా మునుగోడు మండల కేంద్రంలో ఏఐటీయూసీ(AITUC) ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ తీశారు.సమ్మె ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.బిజెపి నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత  చట్టాలను సాధారణ ప్రజలకు అనుకూలంగా లేవు అని అన్నారు. ప్రజలకు నష్టం చేస్తూ ఆదాని అంబానీలకు కార్పొరేట్ శక్తులకు ఎర్ర కార్పేట్ పరుస్తూ స్వాగతం పలుకుతున్నారు. కార్మికులు రాబోవు రోజుల్లో కార్మికులు ఐక్య ఉద్యమాలకు సిద్ధంకావాలని కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు.

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోలుగురు నరసింహ మాట్లాడుతూ... ఉపాధి కూలీలకు రోజుకు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని కోరారు.ఉపాధి హామీలు పనిచేసే చోట అన్ని వసతులు కల్పించాలని చేసిన పనికి వెంటనే బిల్లులు చెల్లించాలని అన్నారు. సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను అధ్యక్షతన జరిగిన సమావేశంలో దళిత కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ గోస్కొండ లింగయ్య,ఏఐటీయూసీ అధ్యక్షుడు దుబ్బ  వెంకన్న, కార్యదర్శి బెల్లం శివయ్య ,కార్మిక సంఘం నాయకులు మాలాద్రి, భీమనపల్లి స్వామి , ధామ కాసిం ,గొర్రె ముత్తయ్య, చందా పాక యాదయ్య ,బొల్లం రాములు, పందుల చిన్న, నరసింహ ,గోలి హుస్సేన్, చిరంజీవి ఉన్నారు.