17-10-2025 01:07:35 AM
ఘట్ కేసర్, అక్టోబర్ 16 : కార్మికుల పక్షాన సిఐటియు నిరంతరం పోరాటం చేస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. ఘట్ కేసర్ మండల సీఐటీయూ 4వ మహాసభ గురువారం పోచా రం మున్సిపల్ అన్నోజీగూడలోని యాదాద్రి పార్క్ లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్, అశోక్, సీనియర్ నాయకులు రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో సిఐటియు కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని, అదేవిధంగా మన మండలంలో మున్సిపల్, మధ్యాహ్న భోజనం, భవన నిర్మాణం, క్యాబ్ డ్రైవర్లు వీరందరికీ ప్రభుత్వం కనీస వసతులు; కనీస వేతనం ఇవ్వాలని అలాగే ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్మికులకు జిహెఎంసిలో 18,500 జీతం ఇస్తుంటే అదే కార్మికులకు ఘట్ కేసర్ ప్రాంతంలో ఆ జీతాన్ని ఎందుకు అమలు చేయట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మధ్యా హ్న భోజన కార్మికులకు నెల నెల బిల్లులు ఎందుకు ఇవ్వట్లేదన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారు కానీ అమలు కాకుం డా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సిఐటియు జిల్లా నాయకులుయాదయ్య, మండల కార్యదర్శి నార్క ట్ పల్లి సబిత, కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు గాంధారి అశోక్, కార్యదర్శి చంద్రమౌళి, కోశాధికారి వినోద్ రెడ్డి, ప్రవీణ్, సదానంద్, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, ఎల్లమ్మ, సుజాత, ముత్తమ్మ, మధ్యాహ్న భోజన కార్మికులు కవిత, ప్రేమలత పాల్గొన్నారు.