calender_icon.png 19 October, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యామ్ రోడ్లకు క్యాబినెట్ ఆమోదం

17-10-2025 01:07:31 AM

వారంలో టెండర్ ప్రక్రియ: మంత్రి వెంకట్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాం తి): ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని 10,547 కోట్లతో నిర్మించే 5,566 కి.మీ రోడ్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్ అండ్ బీ సర్కిళ్ల వారీగా మొత్తం 32 ప్యాకేజీల్లో పనులు చేపట్టనున్నట్లు, అందులో మొదటి ఫేజ్ లో 10 ప్యాకేజీలు వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టనునట్లు చెప్పారు. వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, వచ్చే 30నెలల్లో ప్యాకేజీల వారిగా అన్ని రోడ్లు పూర్తి చేస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.