calender_icon.png 19 October, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి సేవిస్తున్న ఆరుగురు అరెస్ట్

18-10-2025 10:09:28 PM

కాటారం (విజయక్రాంతి): గంజాయి సేవిస్తున్న ఆరుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కాటారం పోలీసులు తెలిపారు. కాటారం ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి సేవిస్తున్న వారి నుండి 900 గ్రాముల గంజాయి, 4 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గారేపల్లి గ్రామానికి చెందిన జాడీ వివేక్, ఆకుల అఖిల్, జాడి గణేష్, దయాకి శ్రీకాంత్, సయ్యద్ అస్లాం, కాటారం గ్రామానికి చెందిన గంట పరిపూర్ణం అనే ఆరుగురు యువకులు బయ్యారం గ్రామ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించారని, పోలీసులను చూసి పారిపోయే క్రమంలో వారిని పట్టుకుని విచారించడంతో గంజాయి సేవిస్తున్నట్టు వెల్లడించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా గంజాయి విక్రయిస్తున్నట్టు ఒప్పుకున్నారని ఎస్ఐ శ్రీనివాస్ వెల్లడించారు. వారి వద్ద నుండి 900 గ్రాముల గంజాయి, 4 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.