calender_icon.png 19 October, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గరిడేపల్లిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బీసీ బంద్ విజయవంతం

18-10-2025 10:26:17 PM

రాజ్యాంగం కల్పించిన పద్ధతిలో బీసీ రిజర్వేషన్ బిల్లుని వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి..

42 శాతం రిజర్వేషన్ కేటాయించెంతవరకు రాజీలేని పోరాటం చేస్తాం..

గరిడేపల్లి (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ బంద్ గరిడేపల్లి మండలంలో శనివారం విజయవంతంగా జరిగింది. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నాయకులు, కార్యకర్తలు ఇతర అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దుకాణాలు మూసి వేయించారు. ప్రభుత్వ కార్యాలయంలో పనులు చేయొద్దంటూ కోరారు. గరిడేపల్లిలో తాసిల్దార్ కార్యాలయం నుంచి కల్మలచెరువు క్రాస్ రోడ్డు వరకు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించింతవరకు రాజీలేని పోరాటం చేస్తామన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో విడుదల చేయడమే కాకుండా, దానిని గవర్నర్ కి పంపించడం కూడా జరిగిందని తెలిపారు. కానీ బిజెపి పార్టీకి అనుకూలమైన గవర్నర్ కావడంతో దానిని ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టడం సరైంది కాదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసేందుకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధపడితే కేంద్ర ప్రభుత్వం దానికి అడ్డుపడుతుందని ఆరోపించారు. నేడు తలపెట్టిన బందులో బిజెపి నాయకులు కూడా పాల్గొన్నారనీ వారు తమ రాష్ట్ర నాయకులతో కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసే విధంగా కోరాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ బందుకు సహకరించిన వ్యాపారస్తులకు వాణిజ్య సంస్థ ప్రతినిధులకు, వివిధ రాజకీయ పక్షాల నాయకులకు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మండల కేంద్రమైన గరిడేపల్లితో పాటు మండలంలోని కీతవారిగూడెం, వెలిదండ, గడ్డిపల్లి, కల్మలచెరువు, రాయినిగూడెంతో పాటు పలు గ్రామాల్లో బీసీ సంఘాల నాయకులు ఆధ్వర్యంలో బందు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, బి.జె.పి, టిడిపి, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన అనుబంధ సంఘాలు నాయకులు త్రిపురం అంజన్ రెడ్డి, కటికం రమేష్,పెండెం ముత్యాల గౌడ్, బల్దూరు సందీప్, కీత రామారావు, వీ.టి,షేక్ యాకుబ్, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు కీసర నాగయ్య, షేక్ చాంద్ మియా, ముచ్చపోతుల కృష్ణ, ఓరుగంటి చిరంజీవి, మంగళగిరి నాగరాజు, ఎలక్ట్రీషియన్ కాశయ్య, మేకపోతుల నాగయ్య, యానాల సోమయ్య, మండవ సైదులు, రావుల రాములయ్య, కొలిపాక శ్రీను, కొలిపాక నారాయణ, కొలిపాక కృష్ణ, సైదులు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.