calender_icon.png 19 October, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దున్నపోతు దాడి.. రైతు మృతి

18-10-2025 10:14:08 PM

ఘట్ కేసర్: దున్నపోతు దాడి చేయటంతో ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఘట్ కేసర్ మున్సిపల్ అంకుశాపూర్ లో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, మృతుని బంధువులు తెలిపిన ప్రకారం.. అంకుశాపూర్ గ్రామానికి చెందిన రైతు పులిగిల్ల జంగయ్య(68) వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లాడు. పనులు ముగించిన అనంతరం దున్నపోతులను మేపుటకు కట్టు యిప్పి దొడ్డి బయటకు వదలగానే రైతును కొమ్ములతో దాడి చేసి పైకి లేపి కిందపడవేసి కొంత దూరం లాక్కువెళ్లింది. దీంతో తీవ్రగాయలై ఆ రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు సాయంత్రం పొలం వద్దకు వెళ్లగా కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా మృతి చెంది పడి ఉన్నాడు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపించారు.