calender_icon.png 19 October, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల రాష్ట్ర బంద్ లో ఉద్రిక్తత..

18-10-2025 10:03:58 PM

చిట్యాల (విజయక్రాంతి): బీసీల రాష్ట్ర బంద్ లో ఉద్రిక్తత వాతావరణం శనివారం జాతీయ రహదారి 65 పై చోటుచేసుకుంది. బీసీలకు న్యాయంగా దక్కాల్సిన 42% రిజర్వేషన్స్ సాధన కోసం శనివారం బీసీల రాష్ట్ర బంద్ ను నిర్వహించగా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం నుండి ర్యాలీగా వచ్చిన నిరసనకారులు ఒక్కసారిగా జాతీయ రహదారి 65 పై అన్ని పార్టీలకు చెందిన నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై వెళ్లే ప్రయాణికులకు అంతరాయం ఏర్పడి కొద్దిసేపు రోడ్డుపై ఘర్షణ వాతావరణం ఏర్పడగా, పోలీసుల రాకతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఘర్షణ జరుగుతుందని ముందే పసిగట్టిన పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేయగా, సమస్య ఉద్రిక్తం అవ్వకుండా చూసుకున్నారు.