09-10-2025 07:26:44 PM
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం హనుమాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ లాలమ్మ, సాయప్ప ప్రశాంత ధ్యాన మందిర నిర్మాణానికి దాతలు, మనసున్న మహారాజులు సహకరించాలని మందిర నిర్మాణ దాత లొంక పాండు కోరారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ తాండూరు వైపు నుండి కుంచారం, జహీరాబాద్, బీదర్ వెళ్లే ప్రధాన మార్గంలో రెండేళ్ల క్రితం తనకున్న 8 ఎకరాల పొలంలో 30 గుంటల విస్తీర్ణంలో దాదాపు 16 లక్షల రూపాయలతో తల్లిదండ్రులు స్వర్గీయ శ్రీ లాలమ్మ, సాయప్ప పేరుపై ప్రశాంత ధ్యాన మందిర నిర్మాణం దాదాపు 40 శాతం పూర్తయిందని తెలిపారు. మందిర ప్రాంగణంలో ఏకశిలా కాశీ విశ్వేశ్వర శివలింగ మందిరం, పంచముఖి హనుమాన్ మందిరం, నవగ్రహాల ప్రతిష్టాపన కోసం వస్తు, ధన రూపేనా దాతలు సహకరించాలని పూర్తి వివరాలకు 99125 22128 నెంబర్ కు ఫోన్ చేయాలని ఆయన కోరారు.