calender_icon.png 10 October, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరిపురం మహిళ అదృశ్యం..

09-10-2025 10:52:54 PM

కోదాడ/నడిగూడెం: నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన పటాన్ జానీ బేగం అను మహిళ అదృష్టమైనట్లు పోలీస్ స్టేషన్ లో భర్త జాఫర్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి. అజయ్ కుమార్ తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ జానీ బేగం(38) వృత్తి కూలీ కూసుమంచికి కూలి పని నిమిత్తం ఈ నెల ఏడో తేదీన ఉదయం 9 గంటలకు వెళ్లి నేటి వరకు ఇంటికి తిరిగి రాలేదని, వెళ్లిన రోజు నీలం రంగు చీరతో ధరించిందని ఎత్తు 4.5 ఫీట్లు చామనఛాయ రంగు ఉంటుందని ఆచూకీ తెలిపిన వారు పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించగలరని ఎస్సై తెలిపారు.