calender_icon.png 10 October, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు అడ్డుకోవడం బాధాకరం

09-10-2025 10:42:46 PM

బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు..

హుజూర్ నగర్: స్థానిక సంస్థల ఎన్నికలను తాత్కాలికంగా హైకోర్టు స్టే విధించడం అత్యంత బాధాకరమని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు. గురువారం పట్టణంలోని బీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత అనేక దశాబ్దాలుగా బీసీలకు సరైన రాజకీయ ప్రాధాన్యత లేని గ్రహించి బీసీ సంఘాలు చేసిన అసమాన పోరాటాల వల్ల దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ బిల్లు ఆమోదించి గవర్నర్కు రాష్ట్రపతికి ఆమోదల కోసం పంపితే అట్టి బిల్లును గత ఆరు నెలలుగా తొక్కి పట్టి బిల్లు ఆమోదం పొందకుండా షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చకుండా బీజేపీ పార్టీ బీసీలకు తీరని అన్యాయం చేసిందని బీజేపీ చేసిన ఈ మోసపూరిత చర్య వల్ల బీసీలు ఎంతగానో నష్టపోయారని అందుకు బీజేపీ తగు మూల్యం చెల్లించుకుంటదన్నారు. 

బీజేపీ పార్టీ కులగణనకు వ్యతిరేకంగా గత 11 సంవత్సరాలుగా వ్యవహరిస్తూనే ఉందని నేడు తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించకుండా బీసీలను అన్యాయానికి గురి చేసిందని బీజేపీ పార్టీ పచ్చి బీసీ వ్యతిరేక పార్టీ అనే నిజాన్ని బీసీ జాతి యావత్తు గ్రహించాలని కొంతమంది బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యులు విషయాన్ని వక్రీకరించేందుకు తెగ తాపత్రయపడుతున్నారని సందెకాడ ఒక పార్టీలో పొద్దటి పూట మరొక పార్టీలో ఉంటూ కోట్లాది రూపాయల డబ్బు సంపాదిస్తూ బీసీలను అడ్డం పెట్టుకొని కోట్లకు పడగెత్తిన అలాంటి ఊసరవెల్లులను నడి బజారులో బట్టలు ఊడదీసి తిప్పుతామని ఆయన హెచ్చరించారు. బీసీలను నిలువునా మోసం చేసిన బీజేపీ పార్టీ నుంచి తక్షణమే ఆ రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని లేదా నోరు మూసుకుని కూర్చోవాలని ఆయన హితవు పలికారు. త్వరలోనే బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు.