09-10-2025 07:32:30 PM
ఎస్టీ కావడంతో పోటీ ఎక్కువగా ఉండే అవకాశం..
తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి జడ్పీటీసీ ఎస్టీ జనరల్ కావడంతో బరిలోకి దిగేందుకు మండల పరిధిలోని సింగారం తండా గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గుగులోతు సోమ్లా నాయక్ ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన సోమ్లా నాయక్ నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ తరఫున జడ్పిటిసి టికెట్ ఇచ్చి ఆశీర్వదిస్తే గెలిచి మండలాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.
గతంలో ఈ ప్రాంతం నుండి ఎంపీటీసీగా గెలిచి ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో 1990 నుండి ఎన్ ఎస్ యుఐ నాయకునీగా జిల్లా స్థాయిలో పనిచేసిన అనుభవం ఉంది అన్నారు 2007, 2014 ఎన్నికల్లో జెడ్పిటిసి గా అవకాశం వచ్చిన అధిష్టానం వేరే వారిని చూపించడంతో అట్టి అవకాశాన్ని వదులుకున్నానని తెలిపారు. సంతు సేవాలాల్ జయంతిని ఈ ప్రాంతంలో కనీవిని ఎరగని రీతిలో నిర్వహించి లంబాడాల ఐక్యతను చాటానని తెలిపారు. జెడ్పిటిసి అభ్యర్థిగా ముగ్గురు పేర్లు కాంగ్రెస్ అధిష్టానానికి పంపించగా అందులో తన పేరు కూడా ఉండడం గర్వంగా ఉందని పేర్కొంటూ, ప్రజలు ఆశీర్వదిస్తే మరింత సేవ చేసే అవకాశం పొందుతానని తెలిపారు.