calender_icon.png 10 October, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికెన్ తిని పలువురు అస్వస్థత

09-10-2025 10:45:36 PM

పెన్ పహాడ్: చికెన్ తిని పలువురు అస్వస్థతకు గురైన సంఘటన మండల పరిధిలోని దూపాడు గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుడు కత్తి ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గత శనివారం బాధితుడు కత్తి ఉపేందర్ తన మనవడి 21వ రోజు వేడుక చేసుకుందామని పెన్ పహాడ్ లోని క్వాలిటీ చికెన్ సెంటర్ వద్ద 6 కేజీల చికెన్ తీసుకుని వెళ్లి శుభకార్యం నిర్వహించారు. భోజనం చేసిన గంట తర్వాత వారి కుటుంబ సభ్యులకు స్వల్పంగా వాంతులు అవుతుంటే మామూలు వాంతులు అని పట్టించుకోలేదు.

తెల్లవారుజాము నుండి విపరీతంగా వాంతులు.. విరోచనాలు కావడంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ లో కత్తి రమణమ్మ, నన్నే పంగి కమలమ్మ, మాతంగి కలమ్మ ముగ్గురు అడ్మిట్ కాగా మరో ఇద్దరు చిన్నారులైన కత్తి అంకిత, కత్తి అక్షితలను ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అంతేకాక మరో మహిళను మరో ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లు అయన తెలిపారు. డాక్టర్లు ఫుడ్ పాయిజన్ వల్లనే అస్వస్థత గురయ్యారని ఆయన పేర్కొన్నారు. చికెన్ షాప్ యజమానిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు అయన తెలిపారు.