09-10-2025 10:36:17 PM
నలుగురికి తీవ్ర గాయాలు..
అశ్వాపురం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట సువ్వలమోరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన డిసిఎం వ్యాన్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి పరిస్థితిని పరిశీలించారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.