calender_icon.png 10 October, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు

09-10-2025 10:29:40 PM

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డా. రూప్ నార్ రమేష్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బీసీల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.9ను హైకోర్టులో సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి సభ్యులు వేసిన కేసుపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గురువారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రూప్ నార్ రమేష్ మాట్లాడుతూ బీసీల ఎదుగుదలను ఓర్చలేని వారు కుట్రలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఖబర్దార్ బీసీ రాజ్యాధికారాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు అని హెచ్చరించారు.

కేసు వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని తెలిపారు. రేపు జిల్లా కేంద్రంలో అన్ని బీసీ సంఘాల సమన్వయంతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు వైరాగడే మారుతీ పటేల్, భోరడా ఉపసర్పంచ్ మొహర్లే తిరుపతి, బొట్టుపల్లి కమలాకర్, మందడే హనుమంతు, బోర్డ్ పటేల్ కొలె సదాశివ్, మొహర్లే శ్యామ్రావు తదితరులు పాల్గొన్నారు.