calender_icon.png 10 October, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

09-10-2025 10:32:41 PM

మంథని (విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లా మంథని మండలంలోని మంథని-భూపాలపల్లి ప్రధాన రహదారి నాగేపల్లి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు మంథని సీఐ రాజు తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. మంథని మండలంలోని నాగేపల్లి గ్రామానికి చెందిన ముక్కేర సమ్మయ్య గౌడ్ తన ద్విచక్ర వాహనంపై గ్రామం నుండి అడవి సొమనపల్లి గ్రామానికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన బోలేరా వాహనం ఢీకొట్టడంతో సమ్మయ్య మృతి చెందాడని సీఐ తెలిపారు.