17-07-2025 05:31:47 PM
ఆహ్వానించిన మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ 3వ డివిజన్ పరిధిలోని కాంగ్రెస్, బిజెపి పార్టీ లకు చెందిన నాయకులు మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ,3వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోనేటి వెంకట్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుమారు 20 మంది నాయకులకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.