17-07-2025 12:15:48 AM
- డీఈఓ కార్యాలయ కేంద్రంగా చక్రం తిప్పుతున్న డుమ్మా టీచర్!
-నచ్చిన చోటికి సర్దుబాటు చేస్తే నజరానా
- ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ నేతల ఇంటి చుట్టూ ప్రదక్షణలు
- విద్యార్థులకు విద్యను అందించడం మినహా అన్నిటి పైన ప్రతేక నజర్
- ప్రేక్షక పాత్రలోనే ఉన్నతాధికారులు?
నాగర్ కర్నూల్ జూలై 16 ( విజయక్రాంతి )ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెప్తూ వస్తున్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు మా్ర తం విద్యార్థులకు విద్యానందించడం మిన హా మిగతా అన్ని వ్యాపారాలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని బాహాటంగా విమర్శ లు వ్యక్తం అవుతున్నాయి.
రియల్ ఎస్టేట్, చి ట్టీలు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు, ఇతర ప్రైవేటు పాఠశా లలు కళాశాల నిర్వహణ వంటి వాటిపై శ్రద్ధ చూపుతూ వ్యాపార సామ్రాజ్యం ఏర్పాటుకు శ్రద్ధ చూపుతున్నారని చర్చ జరుగుతుంది. అందుకు పాఠశాలకు ఇలా వెళ్ళామా అలా వచ్చామా అన్నట్లుగా నివాసగృహానికి అతి చేరువలో పాఠశాల ఉండే విధంగా సర్దుబా టు ప్రక్రియను అనుకూలంగా మలుచుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి.
గత ప్రభు త్వంలో ఉపాధ్యాయులు విద్యార్థుల లేని పా ఠశాలలను మూసేయడంతో ఆ ప్రాంతంలో విద్యార్థులు పూర్తిగా నష్టపోతారని భావించి ఈ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి మూతబడ్డ పాఠశాలను కూడా తెరిపించింది. కాగా ఆయా పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య కు ఆధారంగా ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్య కనుగొనగా ఉపాధ్యాయుల సంఖ్య తగ్గినచోట ఎ క్కువగా ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
దీనిని ఆసరాగా చేసుకొని డుమ్మా కొట్టే పంతులు ముందు వరుసలోకొచ్చి త మకు అనుకూలమైన పాఠశాలకు సర్దుబా టు చేయాలని రాజకీయ ఉపాధ్యాయ సం ఘాల నేతల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అదునుగా భావించిన ఓ డుమ్మా టీచర్ డీఈఓ కార్యాల కేంద్రంగా తప్పుడు సర్దుబాటుకు రాచ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. అందుకు ఒక్కో సర్దుబాటుకు టీచర్ నుండి సుమారు 30 నుండి 50 వేల వరకు వసూళ్లు కూడా చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులు సొంత స్థానాలకు రాకముందే మరికొంత మందిని నిబంధనలకు విరుద్ధంగా వారికి అనుకూలమైన పాఠశాలలకు సర్దుబాటు చే స్తూ ఉత్తర్వులివ్వడం చర్చకు దారితేస్తోంది. సర్దుబాటు చేసే ప్రక్రియలో జూనియర్ టీచర్లకు అవకాశం ఇవ్వాల్సి ఉండగా ప్రధానో పాధ్యాయులను పంపడం విశేషం. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు, ఉపా ధ్యాయుల సంఖ్య ఆధారంగా సబ్జెక్టుల వారి గా క్రోడీకరించి సర్దుబాటు చేయాల్సి ఉన్నా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొంతమందిని ఇప్పటికే సర్దుబాటు చేయడంతో సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో అం తకుముందు పనిచేసిన పాఠశాల విద్యార్థు లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయా ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మరి కొంతమంది ఉపాధ్యా యులు కక్కుర్తి పడి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అనారోగ్యంగా ఉన్నట్లు తప్పుడు దృవపత్రాలు కూడా సృష్టించి సర్దుబాటకు లైన్ క్లియర్ చేసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నా యి. రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలు కొనసాగించడం కోసం అనుకూలమైన స్థానాల కు మార్పిడి కోసం ఈ దుస్సాహసాలకు ఒడిగడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి.
మరి కొంతమంది టీచర్లు మరీ బద్దకం ప్రదర్శి స్తూ ఆర్టీసీ బస్సు సౌకర్యం, హైదరాబాద్ వంటి నగరాలకు దగ్గరగా ఉన్న పాఠశాలకే వెళ్తామనే ధోరణిలో ప్రవర్తిస్తున్నారని చర్చ జరుగుతుంది. ఏజెన్సీ ప్రాంతాలు తాండ గ్రామాల్లో ఉన్న పాఠశాలలకు మాత్రం తర చూ ఆయా ఉపాధ్యాయులు డుమ్మా కొడుతూనే ఉన్నారని అయినా సంబంధిత పర్యవే క్షణ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మచ్చుకు కొన్ని....!
పెద్దకొత్తపల్లి మండలం గోవిందాయ పల్లి ప్రైమరీ స్కూల్ టీచర్ వంగూరు మం డలం ఎల్లమ్మ రంగాపూర్ పాఠశాలకు సర్దుబాటు సాకుతో బదిలీపై వెళ్లారు. పెద్దకొ త్తపల్లి మండలంలో పనిచేసే టీచర్ తెలకపల్లి మండలం లక్నారం గ్రామానికి బదిలీ అ య్యారు.
తాడూరు మండలం ఇంద్రకల్ గ్రా మం నుండి వెల్దండ మండలానికి ఒకరు, కోడేరు మండలం పస్పుల గ్రామం నుండి హిందీ టీచర్ నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు, అచ్చంపేట జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నుండి ఇంగ్లీష్ టీచర్ నాగర్ కర్నూల్ జడ్పిహెచ్‌ఎస్ బాలుర పాఠశాలకు, సాతాపూర్ ప్రాథమిక పాఠశాల నుండి నాగర్ కర్నూల్ సంజయ్ నగర్ ప్రా థమిక పాఠశాలకు, కోడేరు మండలం ఎత్తం పాఠశాల నుండి ఓ పీఈటి వెల్దండ మండలంలోని పాఠశాలకు, బలాన్పల్లి నుండి చర్ల ఇటిక్యాల వంటి అనుకూల పాఠశాలలకు సర్దుబాటు సాకుతో బదిలీ అయ్యారు.
వీటితోపాటు అచ్చంపేట మండలం చెన్నారం గ్రామంలోని పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఎంఈఓ కార్యాలయానికే పరి మితమయ్యాడని ప్రచారంలో ఉంది, కిష్ట తండాలో పనిచేయాల్సిన ఓ టీచర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే శ్రద్ధ చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి, చేదురుభాయ్ త ండాలోని ఓ టీచర్ గత నాలుగేళ్లుగా రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితం కాగా ఇప్పటికీ ఆ పాఠశాలలో విధు లు నిర్వర్తిస్తున్నట్లు రికార్డులు నమోదు కావ డం వెనక ఆంతర్యం ఏంటని సర్వత్ర ప్రశ్న లు వ్యక్తమవుతున్నాయి.
జటప్రోలు గ్రామ పాఠశాలకు ఫిజికల్ సైన్స్ టీచర్ అప్పుడప్పుడు విధుల్లో చేరుతున్నట్లు రికార్డులు నమోదు చేస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పేరుతో డిఈవో కార్యాలయానికే పరిమితమై తెర వెనుక డుమ్మా టీచర్లకు అక్రమ డిప్యూటేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉ న్నాయి.
ఇలాంటి బడి దొంగలు నేటికీ బడికి వెళ్లకుండానే నెల నెలా జీతం తీసుకుంటూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం విద్యా వైద్యం ఉపాధి వంటి అంశాలపైనే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని చెప్తుంది. కానీ తెర వెనుక జరుగుతున్న ఇలాంటి డుమ్మా టీచర్ల బాగోతంపై శ్రద్ధ చూపకపోవడంతో విద్యార్థులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మానవతా దృక్పథంలోనే సర్దుబాటు!
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య కనుగుణంగా సర్దుబాటు చేయాలని ఇ చ్చిన ఆదేశాల మేరకు కొన్ని స్థానిక అవసరాలు ఉపాధ్యాయుల ఆరోగ్య సమ స్యల దృశ్య మానవతా దృక్పథంలో మాత్రమే కొన్ని సర్దుబాటు జరిగాయి. ఇతర వ్యాపకాలతో పాఠశాలకు డుమ్మా కొట్టే ఉపాధ్యాయు లకు ఎట్టి పరిస్థితుల్లో స్థానచలనం జరగకుండా చూస్తాం. కేవ లం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నే సర్దుబాటు చేస్తాం. బయోమెట్రిక్ విధానం అమల్లోకి తీసుకొస్తాం.
రమేష్ కుమార్, డిఈవో, నాగర్ కర్నూల్ జిల్లా