17-07-2025 05:34:35 PM
వెంకటాపురం నూగూరు,(విజయక్రాంతి): తాతల తండ్రుల కాలంలో తమ పూర్వీకులు సంపాదించిన భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని మాల మహానాడు మండల మాజీ అధ్యక్షుడు సాధనపల్లి చిట్టిబాబు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిధి గృహం ఆవరణలో మంచాల భూషణం అధ్యక్షతన జరిగిన మాల మహానాడు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులతో సమానంగా సంవత్సరాల కాలంగా పోడు భూములకు సాగు చేసుకుంటున్నా తమకు భూభారతిలో దరఖాస్తు మేరకు పట్టాలు మంజూరు చేయాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ అభయహస్తం కొనసాగించాలి అని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.