17-07-2025 05:56:10 PM
కన్నాలబస్తీలో ఘటన..
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తిలో ఓ ఇంటి ఎదుట క్షుద్ర పూజలు ఘటన గురువారం కలకలం రేపింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తిలో పెండెం మదూకర్ అనే సింగరేణి కార్మికుడు ఇంటి ముఖ ద్వారం ముందు క్షుద్ర పూజలు చేశారు. మధుకర్ విధులకు వెళ్లేందుకు ఇంటి నుంచి ఐదు గంటల సమయం లోబయటకు వచ్చాడు. ఇంటి ముందు వాకిట్లో నిమ్మకాయలు, మిరప, కాయలు, కుంకుమ, పసుపు బొట్లుపెట్టి, అన్నం ముద్దలు పెట్టీ క్షుద్ర పూజలు చేశారు. తన కుటుంబానికి హానిచేయాలని క్షుద్ర పూజలు చేసి ఉంటారని ఆందోళన వ్యక్త చేశారు. ఈ సంఘటన బస్తీ ప్రజలను తీవ్ర భయాందోళకి గురిచేస్తోంది. తనకి గిట్టని వారు క్షుద్ర పూజలు చేశారనీ మధుకర్ తెలిపాడు పోలీసులు తగిన చర్యలు చేసుకోవాలనీ విజ్ఞప్తి చేశారు.