12 May, 2026 | 1:24 AM

ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

12-05-2026 12:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, మే 11 (విజయక్రాంతి): ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు, రుసుములు, చెల్లింపులపై రాయితీ, దరఖాస్తుల పరిష్కారం కోసం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమ వారం తెలిపారు. ప్రభుత్వం జూలై 31వ తేదీ వరకు ఎల్.ఆర్.ఎస్. రుసుములు, చార్జీల చెల్లింపుపై 25 శాతం రాయికి అవకాశం కల్పించిందని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పెండింగ్ లో ఉన్న ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

దరఖాస్తుల పరిష్కారంపై ఏర్పాటుచే సిన కంట్రోల్ రూమ్ కార్యాలయ పని వేళల్లో (ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు) అందుబాటులో ఉంటుందని, మరిన్ని వివరాల కోసం దరఖాస్తుదా రులు 08736-250501 నంబర్ లో సంప్రదించవచ్చన్నారు.