మేడ్చల్ జిల్లాలో టీఆర్పీ బలోపేతం
జిల్లా కమిటీలో కీలక నియామకాలు
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ బలోపేతంలో భాగంగా జాలిగాపు సౌభాగ్యను జిల్లా ఉపాధ్యక్షురాలిగా, చందనం వనజను జిల్లా కార్య దర్శిగా జిల్లా మహిళా విభాగం అధ్యక్షురా లు నీరుడు శాలిని నియమించారు. పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవా రం వారికి నియామక పత్రాలు అందజేశా రు.
ఈ కార్యక్రమం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం మ హిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, బీసీల హక్కుల సాధన, ప్రజా సమస్యల పరిష్కారంలో కొత్తగా నియమితులైన నాయకులు సమర్థవంతంగా పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
జాలిగాపు సౌభాగ్య, చందనం వనజ పార్టీ నమ్మ కాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. పార్టీ సిద్ధాం తాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి, ప్రజలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షులు అరుణ్ పటేల్, నాయకులు శ్రీనివాస్, నీరుడు బా బు, జాలిగేపు అశోక్, వెంకట్ పాల్గొన్నారు.






