31-07-2025 12:00:00 AM
ఖమ్మం, జులై 30 ( విజయ క్రాంతి): 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి ఆధ్వర్యంలో బుధవారం రేషన్ కార్డులు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ పేద ప్రజలకు రేషన్ కార్డు అనేది ఒక వరం లాంటిదని , గత ప్రభుత్వం ఇవ్వలేని రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని అభివృద్ధిలో , సంక్షేమంలో ఈ ప్రభుత్వం ముందుందని అన్నారు . మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలోఖమ్మం నియోజవర్గంలో దాదాపు పదివేల రేషన్ కార్డు లు మంజూరు అయ్యాయని దీంతోపాటు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
గత ప్రభుత్వంలో పేద ప్రజలు రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందు లకు గురయ్యారు. ఈ సందర్భంగా రేషన్ కార్డు పొందిన ప్రతి ఒక్కరు సంతోషంగా హర్షం వ్య క్తం చేశారు. రేషన్ కార్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని దీనివల్ల సంక్షేమ ఫలాలు లభిస్తాయని కావున రేషన్ కార్డు లేనివాళ్లు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకుని కార్డును పొందాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి శ్రీనివాస్, షేక్ గౌస్, రేఖ లక్ష్మణ్ , వరద వెంకన్న , పొలురి నాగార్జున, సురపానేని సురేష్, సురపానేని రవీందర్, మహేష్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు రేఖ భార్గవి, మరికంటి అనూష , పొనుగొటి స్వప్న, యలమద్ది లక్ష్మి , జోయ మరియు డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు .