31-07-2025 12:00:00 AM
యూఎస్‌పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు చకినాల అనిల్ కుమార్
కామారెడ్డి, జూలై 30 (విజయ క్రాంతి), ఉపాధ్యాయులకు బదిలీలతో కూడిన పదోన్నతులు కల్పించాలని యు.ఎస్.పి.సి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు చకినాల అనిల్ కుమార్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం సందర్భంగా లంచ్ అవార్లు ధర్నా కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జిల్లా కేంద్రాల్లో జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు.
బిఈడి అర్వతగల ఎస్జీటీలకు ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ విద్యాలయ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రెండవ దశ పోరాట కార్యక్రమం జిల్లా కేంద్రాల్లో జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ విద్య రంగా సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో అగస్త అయిన జిల్లా కేంద్రాల తిరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపాధ్యాయులను కోరారు.
ఉపాధ్యా యుల ప్రమోషన్లు బల్లిలా షెడ్యూల్ తక్షణమే విడుదల చేసి ఈ నెలాఖరులో ఒక ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ఆర్వత లేని డి ఈ ఓ లోని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. నూతన జిల్లాలకు డీఈవో పోస్టులను, ప్రతి రెవిన్యూ డివిజన్ కు డిప్యూటీ డి ఈ ఓ, నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించాలన్నారు. కాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యా యుల పెన్షన్ రా వివిధ రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాల కు 5571 పిఎస్ హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయాలన్నారు. బిఈడి టిటిసి అర్వత గల ఇద్దరికి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్ ఇవ్వాలన్నారు. పండి పీఈటీల అప్ గ్రేడేషన్ ప్రక్రియ పూర్తయినందున జీవో 2 3 9 10 లను రద్దుచేసి జీవో 11 12 ప్రకారం పదోన్నతులు కల్పించాలన్నారు.
ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకత్వం సవరించాలన్నారు. వివిధ జిల్లాల్లో జరిగిన పైరవీ డిప్రెషన్ వెంటనే రద్దు చేయాలని గురుకుల టైం టేబుల్ సవరించాలని కేజీబీవీ మోడల్ స్కూటీ చాలా సమస్యలను పరిష్కరించాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యమ సమ్మె కాల బాధ్యతాన్ని వెంటనే చెల్లించాలన్నారు. కేజీబీవీ యు ఆర్ ఎస్ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని మోడల్ స్కూల్ గురుకుల సిబ్బందికి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు.
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పండిట్ పీడీ పోస్టులను అప్గ్రేట్ చేసి వెంటనే పదోన్నతులు ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారిగా నియమించాలని ఉత్తర్వులను ఉప సంహరించాలన్నారు. విద్య రంగంలో ఎన్జీవో జోక్యాన్ని నివారించాలని అన్ని జిల్లాలకు శానిటేషన్ గ్రాండ్ స్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.