31-07-2025 12:00:00 AM
సమీక్ష సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం
బాన్సువాడ, జూలై 30 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని చందూర్, మోస్రా మండల కేంద్రాలలో వచ్చే నెల ఆగస్టు 4వ తేదీన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి అనసూయ సీతక్క చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు.
చందూర్, మోస్రా మండల సముదాయ భవనాలు, మోస్రా లో జనరల్ ఫంక్షన్ హాల్, చందూర్ గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో మంత్రి సీతక్క పాల్గొని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
బుధవారం చందూర్, మోస్రా మండలాల సంబంధిత అధికారులు, నాయకులతో నిర్మాణ పనుల వివరాలను సమీక్ష సమావేశంలో అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.