calender_icon.png 3 January, 2026 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రిలో రూ.1300 కోట్ల్ల అవినీతి

03-01-2026 12:38:31 AM

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): యాదాద్రి ఆలయ నిర్మాణంలో రూ.1300 కోట్ల మేర అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. శాసనమండలిలో స్పెషల్ మెన్షన్స్ అంశం పై ఆయన మాట్లాడారు. ఓ అవుట్ సోర్సింగ్ అధికారి ద్వారా రూ.1300 కోట్లకు టెండర్లు పిలిచారని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

రూ.17 లక్షలకు పనులు చేస్తామని ఓ కాంట్రాక్టర్ ఒప్పుకున్నా గానీ, దాని కి అదనంగా రూ.4 కోట్లకుపైగా నిధులు విడుదల చేశారని తెలిపారు. రూ.20 లక్షల పనులు చేసేందుకు మరొకరు ఒప్పుకుంటే ఆయనకు రూ.3 కోట్లు విడుదల చేశారని, ఇలా ఇష్టానుసారంగా కాంట్రా క్టర్లకు, పలు కంపెనీలకు ప్రభుత్వ సంపదను దోచిపెట్టారని ఆరోపించారు.