calender_icon.png 3 January, 2026 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ, మండలిలో ఐదు బిల్లులు ఆమోదం

03-01-2026 12:38:59 AM

మున్సిపల్, జీహెచ్‌ఎంసీ, ప్రైవేట్ వర్సిటీలు..

మోటారువాహనాల పన్ను విధింపు సవరణ బిల్లులు పాస్ 

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి) : మున్సిపల్, జీహెచ్‌ఎంసీ, ప్రైవేట్ వర్సిటీలు, మెటార్ వెహికల్ ట్యాక్సేషన్ చట్టాల సవరణకు సంబంధించి ఐదు బిల్లులను అసెంబ్లీ, శాసన మండలి ఆమోదించిం ది. ఎలాంటి చర్చ లేకుండానే శుక్రవారం శాసనసభ, శాసన మండలిలో ఈ బిల్లులకు ఆమోద ముద్ర పడింది. ఇందులో హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన మూడు కీలక బిల్లులు ఉన్నాయి.

సీఎం రేవంత్‌రెడ్డి తరఫున మంత్రి శ్రీధర్‌బాబు మున్సిపల్, జీహెచ్‌ఎంసీ బిల్లులను అసెంబ్లీ, శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు స్థాపన, క్రమబద్ధీకరణ బిల్లును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజననరసింహ సభలో ప్రవేశపెట్టారు. ఇక  మోటారు వాహనాల పన్ను విధింపు సవరణ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై కాం గ్రెస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ పార్టీలకు చెం దిన ఎమ్మెల్యేలు మాట్లాడారు. అనంతరం మూజువాణి ఓటుతో సభ ఈ బిల్లులను ఆమోదించింది.