calender_icon.png 5 September, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాస్మెటిక్ గైనకాలజీ ఫెలోషిప్

04-09-2025 12:00:00 AM

ఓజోన్ హాస్పిటల్‌లో నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): మహిళల ఆరోగ్యం, వైద్యరంగంలో కొత్త పద్ధతులను పరిచయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటున్న ఓజోన్ హాస్పిటల్స్, రెండు రోజులపాటు హ్యాండ్స్-ఆన్ కాస్మెటిక్ గైనకాలజీ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను విజయవంతం గా నిర్వహించింది. ఈ ఫెలోషిప్‌లో పాల్గొన్న వైద్యులు ఆధునిక శస్త్రచికిత్స పద్ధతులు, లేజ ర్ ట్రీట్మెంట్స్, కొత్త సాంకేతికతలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా ప్రత్యేక జ్ఞానాన్ని అందుకున్నారు.

డాక్టర్ జి.పూజిత (కన్సల్టెంట్ గైనకా లజిస్ట్  ఓజోన్ హాస్పిటల్స్) ఆధ్వర్యంలో   పాల్గొన్న వారికి ఆధునిక కాస్మెటిక్ గైనకాలజీ విధానాలపై విశ్లేషణాత్మక శిక్షణ అం దించారు. ముఖ్య అతిథి జి దీప్తి మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఓజోన్ హాస్పిటల్స్ మాట్లాడుతూ.. ‘వైద్యుల జ్ఞానం విస్తరించడానికి, కొత్త నైపుణ్యాలు పొందేందుకు, ఇలాంటి ఫెలోషిప్లు చాలా ఉపయోగకరమని చెప్పా రు.

డాక్టర్ స్వప్న కుమారి - సీనియర్ గైనకాలజిస్ట్(స్వప్న హాస్పిటల్స్), డాక్టర్ ఫెహ్మిదా బాను,- సీనియర్ గైనకాలజిస్టు - ఫెమికెరె హాస్పిటల్స్ మాట్లాడారు. డాక్టర్ ఇంద్రసేన్‌రెడ్డి కంకణాల డైరెక్టర్, చీఫ్ జనరల్ ఫిజీషి యన్, వై.మధుసూదన్‌రెడ్డి డైరెక్టర్, డా. వై. సుమన్ కుమార్ సీఓఓ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దేశం నలు మూలల నుంచి ఎంతో మంది గైనకాలజిస్టులు తదితరులు పాల్గొన్నారు.