calender_icon.png 7 November, 2025 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించండి

07-11-2025 12:26:17 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 6(విజయక్రాంతి): రైతులు పత్తి పంటను సీసీఐ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం బూర్గుడ గ్రామ శివారులోని ఆర్.ఎస్.జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షే మం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి మద్దతు ధర చెల్లించి పంట కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు తాము పండించిన పత్తి పంటను దళారులకు, ప్రైవేట్ వ్యాపారస్తులకు విక్రయించి నష్టపోకూడదని తెలిపారు. ప్రతి రైతు కపాస్ కిసాన్ యాప్ ను వినియోగించుకోవాలని, తమ వివరాలు నమోదు చేసుకోవా లని, ఆ దిశగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

జిల్లాలో 3 లక్షల 30 వేల ఎకరాలలో పత్తి పంట సాగు చేశారని, సుమారు 38 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో 24 జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.8,110లు మద్దతు ధర అందిస్తుందని, ప్రభుత్వం చెల్లిస్తున్న మద్దతు ధర, తేమశాతం అంశాలపై ప్రజలందరికీ తెలి సే విధంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, వ్యవసాయ శాఖ అధికారి మిలింద్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు అలీబిన్ అహ్మద్, సి సి ఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల నిర్వహకులు, రైతులు పాల్గొన్నారు.