07-11-2025 12:27:31 AM
జిల్లా శిక్షణ కలెక్టర్ సలోని చాబ్ర
ఆదిలాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి) : బాల్య వివాహ రహిత తెలంగాణ సాధనలో భాగంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో నెల రోజుల పాటు (నవంబర్ 1 నుంచి డిసెంబర్ 1 వరకు) ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జిల్లాలో ప్రారంభమయ్యాయి. బేటి బచావోబేటి పాడావో కార్యక్రమంలో భాగం గా గురువారం స్థానిక భుక్తాపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా శిక్షణ కలెక్టర్ సలోని చాబ్ర హాజరైయ్యారు.
ఈ సందర్భంగా ష్యూర్ ఎన్జీవో ఆధ్వర్యంలో చేపడు తున్న కార్యక్రమాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆమె ఆవిష్కరించి, పోస్టర్లను స్కూల్ గోడలపై అతికించారు. అనంతరం శిక్షణ కలెక్టర్ మాట్లాడుతూ... బాల్య వివాహాల నిర్మూల నకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాల్య వివాహం చట్టరిత్యా నేరమని, దీన్ని అరికట్టడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
బాల్య వివాహం సమాచారం తెలిసిన వెంటనే బాలల రక్షణ కోసం 1098, మహిళల భద్రత కోసం 181, అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ప్రధానోపాధ్యాయులు సాజీల బేగం, అధికారులు యశోద, రాజేంద్ర ప్రసాద్, సఖి కేంద్రం అడ్మినిస్ట్రేటర్ లావణ్య, చైల్ లైన్ కో-ఆర్డినేటర్ సతీష్, ష్యూర్ NGO కో ఆర్డినేటర్ వినోద్, సిబ్బంది సౌజన్య తదితరులు పాల్గొన్నారు.