calender_icon.png 7 November, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసాంఘిక కార్యకలాపాల కట్టడికి చర్యలు

07-11-2025 12:24:41 AM

ఎస్పీ అఖిల్ మహాజన్ 

ఆదిలాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి) : అసంఘిక కార్యకలాపాలు కట్టడితో పాటు గంజాయి, గుడుంబా, గాంబ్లింగ్ లాంటివి నిర్వహించకుండా విలేజ్బోలిస్ ఆఫీసర్ (విపిఒ) విధానాన్ని కఠిన తరం చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసులకు సూచించారు.  వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఉట్నూర్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ తనిఖీ చేసారు. ఉట్నూర్ అదనపు ఎస్పి కాజల్ సింగ్ తో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించి పరిశుభ్రతను పాటించాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు.

పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా త్వరితగతిన సిబ్బందిని కేటాయించి పోలీసుల గౌరవం పెంచేలా విధుల నిర్వహణ చేపట్టాలని సూచించారు. సిబ్బందిచే ప్రత్యేకంగా డ్రిల్ నిర్వ హించారు. పోలీసు సామాగ్రిని, వస్తువులను వాటి నిర్వహణను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో దీర్ఘకాలికంగా ఉన్న వాహనాల స్థితిగతులు, వాటి కేసుల వివరాలు తెలుసుకు న్నారు. అదేవిధంగా స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ మొక్కను నాటి, పోలీస్ స్టేషన్ అంతటా పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించా రు.

తదుపరి రిసెప్షన్ సెంటర్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ బాధితుల ఫిర్యాదుల పై దర్యా ప్తు పూర్తి చేసి సరైన సమయంలో న్యాయం చేపట్టాలని తెలిపారు. స్టేషన్ రికార్డుల నిర్వహణ, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేసేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ మడావి ప్రసాద్, ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.