calender_icon.png 25 October, 2025 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎట్టకేలకు ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు

25-10-2025 12:00:00 AM

-క్వింటాలు తెల్ల బంగారం మద్దతు ధర రూ. 8,110

-నాణ్యమైన పత్తి తీసుకురావాలని కలెక్టర్ సూచన

-కపాస్ కిసాన్ యాప్‌లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు

-కొనుగోలు సజావుగా సాగాలని అధికారులకు ఆదేశం

ఆదిలాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : జిల్లాలో రైతులు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న పత్తి కొనుగోళ్లు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఇటీవల కురిసి న భారీ వర్షాలతో పత్తి పంట సాగు కాస్త ఆలస్యం అవ్వడంతో దసరా కు ప్రారంభం కావలసిన పత్తి కొనుగోళ్లు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వ హించిన పత్తి కొనుగోళ్ల ప్రక్రియకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. 

రైతులు, రైతు సంఘం నేతలు, అధికారులతో కలిసి కలెక్టర్ ముందుగా కొనుగోలు కాంటాలకు ప్రత్యేక పూజలు చేసి, మార్కెట్ కు పంట ను తీసుకొచ్చిన తొలి రైతును శాలువాతో సత్కరించి కొనుగోళ్లను లాంఛనంగా ప్రారంభించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా తెల్ల బంగా రం క్వింటాల్ ధర రూ. 8,110 కనీస మద్దతు ధరను నిర్ధారించిందని, కాగా ప్రైవేట్ మార్కె ట్ ధర సుమారు రూ. 6,500 గా ఉంది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని సం బంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలదేవి, ఏఎస్పీ  సురేందర్ రావు, ఏడి మార్కెటింగ్ గజానన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, సీసీఐ బ్రాంచ్ మేనేజర్ పునీత్ రాటి, సెంటర్ ఇన్చార్జ్ శరత్, చంద్రశేఖర్ రెడ్డి, ఏవో శక్తి పాత్రో, ఏఎం మార్కెటింగ్ (సీసీఐ) పూజ, దినేష్ బిస్త్ అధికారులు పాల్గొన్నారు.