25-10-2025 12:00:00 AM
-5000 మందికి ఏర్పాట్లు
-క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి పేరు నమోదు చేసుకోవాలి
-సద్వినియోగం చేసుకోవాలి
-ఎమ్మెల్యే వినోద్
మంచిర్యాల, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్ట ణంలోని ఏఎంసీ గ్రౌండ్‌లో ఈ నెల 26న సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇందు కోసం సింగరేణి అధికారులు ఓవైపు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, కాంగ్రెస్ నాయకులు మరోవైపు భారీగా ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరై మెగా జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
ఇందులో భాగంగా గురు వారం జాబ్ మేళాకు సంబంధించిన ప్రచార పోస్ట ర్‌ను సింగరేణి భవన్‌లో సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్‌తో కలిసి బెల్లంపల్లి ఎమ్మెల్యేగగడ్డం వినోద్‌లు ఆవిష్కరించారు. జాబ్ మేళా కోసం ఏఎంసి గ్రౌండ్ తో పాటు చిల్డ్ర న్స్ పార్కులో కూడా అభ్యర్థులకు సౌకర్యా లు ఏర్పాటు చేస్తున్నారు. మెగా జాబ్ మేళా కు సంబంధించిన గోడ ప్రతులను సింగరేణి సిబ్బందితో అంటిస్తూ ప్రచారం చేస్తున్నారు.
క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి పేరు నమోదు చేసుకోవాలి
సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మెగా జాబ్ మేళాలో పాల్గొనదలిచిన నిరుద్యోగ యువత పోస్టర్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి పేరు నమోదు చేసుకోవలసి ఉంటుంది. నిరుద్యోగులు తమకు గల విద్యార్హతలకు సంబంధించిన ఉద్యోగాలను ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. గతం లో సింగరేణి ఆధ్వర్యంలో రామగుండం, వైరా, మధిర, భూపాలపల్లిల్లో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా సుమారు 12 వేల మందికి పైగా ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఏడవ తరగతి నుంచి మొదలు ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ చదివిన నిరుద్యోగ అభ్యర్థులకు ఇదొక సువర్ణ అవకాశం. ఐటీ, నాన్ ఐటి, మ్యానుఫ్యాక్చర్, సర్వీస్ సెక్టార్, ఫార్మాలతో పాటు వివిధ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.
నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్
బెల్లంపల్లి నియోజక వర్గంతో పాటు జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ప్రజా ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా బెల్లంపల్లిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఈ మేళాకు సుమారు 80కి పైగా ప్రైవేటు కంపెనీలతో 5000 మందికిపైగా అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ మేళా జరుగుతుందన్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు మందమర్రి సింగరేణి ఏరియా జిఎం రాధాకృష్ణతో కలిసి చేస్తున్నాం.