19-11-2025 12:00:00 AM
మహబూబాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): కపాస్ కిసాన్ యాప్‌తో రైతులు రైతులు అయెమాయానికి గురవుతున్నారు.. వెంటనే ఆ యాప్‌ను రద్దు చేసి పాత పద్ధతిలోనే పత్తి కొనుగోళ్లు జరపాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి తన్నీరు హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పూ ర్తిగా గాలికి వదిలేశారని సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి చిన్న విషయానికి ఢిల్లీకి వెళ్తాడని, మోదీతో దోస్తీ ఉంది..
ప్రధానితో మాట్లాడి.. పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పించడంలో ఎందుకు విఫలం అవుతున్నారని ప్రశ్నించారు. మంగళవారం వరంగల్ ఎనుమాముల, కేసముద్రం వ్యవసాయ మార్కెట్లను ఆయన సందర్శించారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి రైతు లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ప్రజలకు, రైతులకు, ఇతర వర్గాలకు లేనిపోని హామీలు ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలతో దెబ్బతిన్న చెరువులు, కుంటలు, చెక్ డాంలకు ఇప్పటివరకు మరమ్మతులు చేయలేదని ఆరోపించారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాలతో రైతులు దళారులకు పత్తి అమ్మొ కుంటున్నారన్నారు. విదేశాల నుంచి పత్తి దిగుమతి సుంకా లను కేంద్రం సవరించిందని, కేంద్రం తీసుకువచ్చిన నిబంధనలు బడా పారిశ్రామిక సంస్థలు వ్యాపారులకు లాభంగా మారాయని, రైతులకు ఏలాంటి లా భం లేదన్నారు
రైతులను మోసం చేసినందుకా విజయోత్సవాలు?
రైతులపై లాఠీఛార్జీలు, ఆత్మహత్యలు పెరిగాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా ఏడాది పాటు విజయోత్సవాలు జరుపుతారని ప్రశ్నించారు. రైతులను మోసం చేసినందుకా, యూరియా సకాలంలో ఇవ్వనందుకు విజయోత్సవాలు చేస్తారా సీఎం చెప్పాలన్నారు. కలెక్షన్లపై మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరుపుకున్నారు, తప్ప రైతు సమస్యలపై ఏ రోజు సమీక్ష జరపలేదని విమర్శించారు.
రైతులకు చెల్లించాల్సి ధాన్యం బోనస్ వెంటనే మంజూరు చేయాలని, వ్యవసాయ మంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్రంతో చర్చలు జరపాలన్నారు. కేంద్రం ఇప్పటికైనా దిగొచ్చి తేమ శాతంను సవరించి పత్తి కొనుగోలు చేయాలన్నారు. రైతు సమస్యలను పరిష్కరించని పక్షంలో జూబ్లీ హిల్స్ నివాసాలను ముట్టడిస్తాంమన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వరంగల్ ముంపుకు గురవుతోందని, ముంపు బాధితులకు ప్రభుత్వం 15వేల రూపాయల సహాయం చేయాలన్నారు.
కార్యక్రమంలో హరీశ్‌రావు వెంట రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు శివకోటి మధుసూదనా చారి, తక్కల్లపల్లి రవీందర్రావు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు మాలోత్ కవిత, ఎర్రబెల్లి దయాకర్ రావు, గండ్ర వెంకట రమణారెడ్డి, రాజయ్య, వినయ్భాస్కర్, నన్నపనేని నరేందర్, బానోత్ శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, డిఎస్ రెడ్య నాయక్, ధర్మారెడ్డి, నీలం దుర్గేష్, రావుల రవిచంద్ర రెడ్డి, మార్నేని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.