19-07-2025 12:46:39 AM
కొత్తగూడెం, జూలై 18 (విజయ క్రాంతి )కొత్తగూడెం ఏరి యా జి.యం. ఎం. షాలేం రాజు ఆదేశాల మేరకు కారుణ్య నియామకాల కొరకు జికేఓసీ & ఆర్.సి.హెచ్.పి నందు విధు లు నిర్వహిస్తూ మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన/ మరణించిన ఉద్యోగుల వారసులు 04 (నాలుగు) మందికి జెవిఆర్ ఓసీ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఏరియా లెవెల్ డిపెండెంట్ కమిటీ సభ్యులతో శుక్రవారం కౌన్సిలింగ్, కుటుంబ సభ్యుల సాక్షుల సమక్షంలో నిర్వహించారు.
అన్ని వివరాలు నమోదు చేసి వైద్యపరీక్షలకు పంపించి, కంపెనీ నియమ నిబంధనల ప్రకారం, నియామక ఉత్తర్వులు అందజేయడం జరుగుతుందని జి.ఎం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జెవిఆర్ ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్.వి.ఆర్ ప్రహ్లాద్, డి.జి.యం. (పర్సనల్) గామలపాటి వెంకట మోహన్ రావు, జెవిఆర్ ఓసి మేనేజర్ రాజేశ్వర్ రావు, సీనియర్ పర్సనల్ అధికారులు,మజ్జి మురళి, కె. దేవదాస్, సంబంధిత క్లర్క్ కొత్తపల్లి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.