21-07-2025 06:28:36 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో మాల సంఘం ఆధ్వర్యంలో నూతనంగా బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి, జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్, బిఎస్ఐ జిల్లా ట్రెజరీ సేపూరి సిద్ధార్థ, మాల సంఘం జిల్లా ట్రెసరీ రొడ్డ గంగన్న, సలహాదారుడు రాజేశ్వర్, విగ్రహావిష్కరణ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచానికే శాంతి మార్గాన్ని చూపెట్టింది గౌతమ బుద్ధుడు ఆని అంబేద్కర్ తన చివరి రోజులలో బౌద్ధ మతాన్ని స్వీకరించాడని అన్నారు. సోమవారం రోజు బీరవేల్లి గ్రామంలో మాల సంఘ సభ్యులు అందరూ కలిసి గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ సర్పంచ్ బ్యాగరి ఎల్లన్న, నాయకులు పాల్గొన్నారు.